గ్రేటర్ ఎన్నికల ద్వారా పార్టీ పునాదుల్ని తెలంగాణలో నిర్మించాలని తలంచి పెద్దఎత్తున బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్ లో భారీ స్థాయిలో ప్రచారానికి వచ్చారు. తాజాగా వెలువడ్డ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో వాళ్లంతా ఇప్పుడు ఫుల్ హ్యాపీస్. 2016లో నాలుగే సీట్లు దక్కించుకున్న జాతీయ పార్టీ.. ఈసారి అదిరిపోయే రేంజ్‌లో సీట్లు దక్కించుకుంది. దాదాపు 12 రెట్లు ఎక్కువగా… 48 సీట్లలో నెగ్గి సరికొత్త సందేశాన్ని పంపడం వీళ్లకి మరింత ఆనందాన్నిచ్చింది. గ్రేటర్ ఓటర్ ప్రధాన పార్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేసి.. తమకు పట్టం కట్టారని బీజేపీ దళం ఆనందంలో మునిగితేలుతోంది. అమిత్‌షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరాని వంటి టాప్ లీడర్స్ ఇక్కడకు వచ్చి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. యంగ్ అండ్ ఎనర్జిటిక్ తేజస్వి సూర్య ఇంపాక్ట్ కూడా ఇక్కడ పడింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కష్టపడి పనిచేశారంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నమ్మట్లేదన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అందుకే బీజేపీకి బంపర్ విక్టరీని ఇచ్చారన్నారు. ఇప్పుడు ఇచ్చింది జస్ట్ శాంపిలే అని.. 2023లో అసలైన ఝలక్ ఉంటుందన్నారు నడ్డా. అటు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రజాదరణ కోల్పోతోందన్నారు. మొన్న దుబ్బాక.. ఇప్పుడు గ్రేటర్ ప్రజలు స్పష్టమైన తీర్పుఇచ్చారన్నారు. 2023లో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు కిషన్ రెడ్డి.
ప్రధానమంత్రి @narendramodi గారి సారధ్యంలో,అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.
GHMC ఎన్నికల అద్భుతమైన ప్రదర్శనకు @JPNadda గారికి & @bandisanjay_bjp కు అభినందనలు.@BJP4Telangana కార్యకర్తల యొక్క కృషిని అభినందిస్తున్నాను.
— Amit Shah (@AmitShah) December 4, 2020
हैदराबाद की जनता का आभार और हमारे कार्यकर्ताओं का अभिनन्दन
https://t.co/XG05GpFhvy— Jagat Prakash Nadda (@JPNadda) December 4, 2020
“भाग्यनगर” का भाग्योदय प्रारंभ हो रहा है…
हैदराबाद के निकाय चुनावों में भाजपा एवं आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व पर अभूतपूर्व विश्वास जताने के लिए “भाग्यनगर” की जनता का कोटि-कोटि धन्यवाद।
— Yogi Adityanath (@myogiadityanath) December 4, 2020