హుస్సేన్ సాగర్ పటిష్టతను పరిశీలించిన అధికారులు

|

Oct 29, 2020 | 1:38 AM

Hussain Sagar  : హుస్సేన్ సాగర్ పటిష్టత పరిశీలనకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో 10 మంది సభ్యులు పని చేయనున్నారు. హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ సవాళ్లు వంటి అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక అందించాలని వీరిని ప్రభుత్వం ఆదేశించారు. కాగా వర్షాల పడినప్పుడు హుస్సేన్ సాగర్ ప్రమాదకరంగా మారుతోంది. వరద నీరు భారీగా వచ్చి చేరడంతో సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటోంది. దీంతో పరిసర ప్రాంత […]

హుస్సేన్ సాగర్ పటిష్టతను పరిశీలించిన అధికారులు
Follow us on

Hussain Sagar  : హుస్సేన్ సాగర్ పటిష్టత పరిశీలనకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో 10 మంది సభ్యులు పని చేయనున్నారు. హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ సవాళ్లు వంటి అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక అందించాలని వీరిని ప్రభుత్వం ఆదేశించారు.

కాగా వర్షాల పడినప్పుడు హుస్సేన్ సాగర్ ప్రమాదకరంగా మారుతోంది. వరద నీరు భారీగా వచ్చి చేరడంతో సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటోంది. దీంతో పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో సాగర్ పటిష్టతను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అడుగులు వేస్తోంది.