పెన్షన్‌దారులకు మరో గుడ్ న్యూస్.. లైఫ్ సర్టిఫికేట్ గడువు పెంపు.. కీలక ఉత్తర్వులు జారీ..

|

Nov 25, 2020 | 3:03 PM

కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

పెన్షన్‌దారులకు మరో గుడ్ న్యూస్.. లైఫ్ సర్టిఫికేట్ గడువు పెంపు.. కీలక ఉత్తర్వులు జారీ..
Follow us on

Submission Of Life Certificate: కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లైఫ్ సర్టిఫికేట్ గడువును మరికొంత కాలం పెంచాలంటూ వివిధ పెన్షన్‌దారుల సంఘాల నుంచి పిటిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి ప్రతీ ఏడాది నవంబర్‌లోగా లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా పెన్షనర్లు బ్యాంకులకు వెళ్ళలేని పరిస్థితి. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి వృద్దులలోనే అధికంగా ఉంటుందని వైద్యులు సూచించడంతో కంట్రోలర్ జనరల్ అఫ్ అకౌంట్స్‌ కార్యాలయంతో సంప్రదింపులు జరిపి కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ లైఫ్ సర్టిఫికేట్ చివరి తేదీని పొడిగించింది. కాగా, ఫిబ్రవరి వరకు ప్రతీ నెలా రైల్వే పెన్షనర్లకు యధాతధంగా పెన్షన్ అందిస్తామని పేర్కొంది.

ఇది చదవండి: ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..