కొత్త ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలి: గవర్నర్

| Edited By:

Jun 14, 2019 | 12:17 PM

మూడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ముందుగా కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బడుగు వర్గాల అభ్యన్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. పోలవరాన్ని స్పీడ్‌గా పూర్తిచేస్తామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించటమే మా లక్ష్యమన్నారు. టెండర్ల ప్రక్షాళనకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కుల, మత రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను నియమించి, వారి ద్వారా నవరత్నాలు ప్రజలకు అందిస్తామన్నారు. కొత్త ప్రభుత్వం […]

కొత్త ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలి: గవర్నర్
Follow us on

మూడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ముందుగా కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బడుగు వర్గాల అభ్యన్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. పోలవరాన్ని స్పీడ్‌గా పూర్తిచేస్తామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించటమే మా లక్ష్యమన్నారు. టెండర్ల ప్రక్షాళనకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కుల, మత రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను నియమించి, వారి ద్వారా నవరత్నాలు ప్రజలకు అందిస్తామన్నారు. కొత్త ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలన్నారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500లు, కైలు రైతులకు కూడా రైతు భరోసా పథకం అందుతుందన్నారు.