టీటీడీ పాలకమండలి బర్తరఫ్ యోచనలో ఏపీ ప్రభుత్వం..!
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఏపీ ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి డైరెక్టర్ రవికుమార్‌పై ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఒత్తిడి తీసుకువచ్చారన్న ఫిర్యాదుపై చర్యలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటికే స్విమ్స్ డైరెక్టర్ ఫిర్యాదుతో ప్రభుత్వానికి టీటీడీ ఈవో నివేదిక పంపారు. ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలక మండలి రద్దు చేయకముందే ఛైర్మన్‌పై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకొని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం […]
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఏపీ ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి డైరెక్టర్ రవికుమార్‌పై ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఒత్తిడి తీసుకువచ్చారన్న ఫిర్యాదుపై చర్యలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటికే స్విమ్స్ డైరెక్టర్ ఫిర్యాదుతో ప్రభుత్వానికి టీటీడీ ఈవో నివేదిక పంపారు. ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలక మండలి రద్దు చేయకముందే ఛైర్మన్‌పై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకొని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.