ఫరూఖ్ అబ్దుల్లాకు చేదు అనుభవం.. ఆలయంలోకి నో ఎంట్రీ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాకు శ్రీనగర్‌లో చేదు అనుభవం ఎదురయ్యింది. జ్యేష్టా దేవీ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లిన సమయంలో ఆయన్ను కాశ్మీరీ పండిట్లు అడ్డుకున్నారు. ఫరూఖ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించకుండా మహిళలు ఆయన్ను అడ్డుకున్నారు. ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ఫరూఖ్ అబ్దుల్లా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నిరాశతో వెనుతిరిగారు ఫరూఖ్. తమ కష్టాలకు మీలాంటి నేతలే కారణమని కాశ్మీరీ పండిట్లు ఆరోపిస్తున్నారు.