గుడ్ న్యూస్: ఇకపై మహిళలకు బ్యాంకు రుణాలు సులభతరం!

| Edited By:

Aug 07, 2020 | 12:09 PM

పేద మహిళలకు, స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐటీ విభాగం ఎమర్జింగ్‌ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన ‘బ్లాక్‌చెయిన్‌ – ప్రొటెక్షన్‌ ఆఫ్‌ స్త్రీ నిధి ట్రాన్జాక్షన్స్‌’(బీ–పోస్ట్‌)ను ప్రభుత్వం ప్రారంభించింది.

గుడ్ న్యూస్: ఇకపై మహిళలకు బ్యాంకు రుణాలు సులభతరం!
Follow us on

పేద మహిళలకు, స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐటీ విభాగం ఎమర్జింగ్‌ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన ‘బ్లాక్‌చెయిన్‌ – ప్రొటెక్షన్‌ ఆఫ్‌ స్త్రీ నిధి ట్రాన్జాక్షన్స్‌’(బీ–పోస్ట్‌)ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్‌ రేటింగ్‌ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది.

ఇకపై మహిళలకు బ్యాంకు రుణాలు సులభతరం కానున్నాయి. ‘బీ పోస్ట్‌’ విధానంతో ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి. పౌర సేవలను అందించే టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. బ్యాంకు లావాదేవీలపై అవగాహన లేని నిరుపేద మహిళలకు బీ పోస్ట్‌ ద్వారా సమర్థవంతంగా సేవలు అందుతాయన్నారు.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!