తెలంగాణ : గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లు ఖరారు !
తెలంగాణ శాసనమండలికి మరో మూడు కొత్త ముఖాలు రాబోతున్నాయి. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ శాసనమండలికి మరో మూడు కొత్త ముఖాలు రాబోతున్నాయి. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఖాళీ అయిన మూడు స్థానాలకు గవర్నర్ కోటా కింద ప్రముఖ ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం అందుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముగ్గురు పేర్లతో ఖరారు చేసిన జాబితాను గవర్నర్ ఆమోదానికి పంపించినట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది .
బస్సరాజు సారయ్య గతంలో కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్ర మంత్రిగానూ సేవలందించారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఆ నగరానికి చెందిన బీసీ నాయకుడు అయిన బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని ప్రచారం జరుగుతోంది.
ఇక వైశ్య సామాజిక వర్గం కోటాలో దయానంద్‌కు అవకాశం కల్పించారట. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు ఈసారి ఎమ్మెల్సీగా చట్టసభకు పంపంచి గౌరవించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారట. మరికొన్ని కీలక నిర్ణయాలు కేసీఆర్ మంత్రివర్గ సమావేశం తీసుకున్నారు. దుబ్బాక ఓటమి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయకుల మరింత కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారట.
ఇవి కూడా చదవండి :
ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
తెలుగు ప్రజలకు సీఎంల దీపావళి శుభాకాంక్షలు, ప్రజల జీవితాల్లో పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్ష
రైతును మోసం చేసిన విత్తన సంస్థకు ఫైన్.. రూ.2.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం
ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయి, చలి కాలంలో అప్రమత్తత అవసరం : కోటి కమాండ్ సెంటర్ డీహెచ్