రేషన్ కార్డు దారులకు శుభవార్త.. వచ్చే నెలలో..

| Edited By:

Apr 26, 2020 | 3:02 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు అతలాకుతలమయ్యాయి. అయితే.. ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వచ్చే(మే)

రేషన్ కార్డు దారులకు శుభవార్త.. వచ్చే నెలలో..
Follow us on

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు అతలాకుతలమయ్యాయి. అయితే.. ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వచ్చే(మే) నెలలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యంతోపాటు కంది పప్పు కూడా అందనుంది. తాజాగా పౌరసరఫరాల శాఖ మే నెల రేషన్‌ సరుకుల కోటా కింద ఉచిత బియ్యం, కందిపప్పుతో పాటు గోధుమలు, చక్కెర కోటాను కేటాయించింది.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో.. ప్రతి కార్డుదారుడికి యూనిట్‌కు 12 కిలోల చొప్పున బియ్యం, కిలో కంది పప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.. సబ్సిడీ ధరపై రెండు కిలోల గోధుమలు అందిస్తారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో కలిపి మొత్తం ఆహార భద్రత కార్డు కలిగిన సుమారు 16 లక్షల 930  కుటుంబాలు ఉన్నాయి. అందులో  55,75,583 లబ్ధిదారుల(యూనిట్‌)లకు గాను 6,83,06,702 కిలోల బియ్యం కేటాయించారు.

కాగా.. 16 లక్షల 930 కిలోల కంది పప్పు, 32 లక్షల 1860 కిలోల గోధుమల కోటా అలాట్‌ అయింది. అయితే గోధుమలు, చక్కెర కోటాలకు సంబంధించిన రిలీజింగ్‌ ఆర్డర్‌ (ఆర్వో)ల కోసం మాత్రమే మీ సేవా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది. దీంతో ఈసారి ఉచిత బియ్యంతో పాటు కిలో కంది పప్పు కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.