డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి శుభవార్త..!

|

Jan 12, 2020 | 9:31 AM

ఈ మధ్యకాలంలో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నారు. ఇక అదే సమయంలో పోలీసులకు కూడా దొరికిపోతుంటే వేలల్లో ఫైన్లు కట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్నిసార్లు వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు లైసెన్స్ అప్లై చేసుకునే ప్రతీసారి.. మొదట లెర్నింగ్ లైసెన్స్‌ను ఇచ్చి.. ఆ తర్వాత రెన్యూవల్ లైసెన్స్ ఇచ్చేవారు. అంతేకాకుండా ఆ రెండింటికీ కూడా వేర్వేరు అప్లికేషన్ ఫామ్స్‌ను పూర్తి చేయాల్సి ఉండేది. అయితే ఇకపై […]

డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి శుభవార్త..!
Follow us on

ఈ మధ్యకాలంలో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నారు. ఇక అదే సమయంలో పోలీసులకు కూడా దొరికిపోతుంటే వేలల్లో ఫైన్లు కట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్నిసార్లు వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు లైసెన్స్ అప్లై చేసుకునే ప్రతీసారి.. మొదట లెర్నింగ్ లైసెన్స్‌ను ఇచ్చి.. ఆ తర్వాత రెన్యూవల్ లైసెన్స్ ఇచ్చేవారు. అంతేకాకుండా ఆ రెండింటికీ కూడా వేర్వేరు అప్లికేషన్ ఫామ్స్‌ను పూర్తి చేయాల్సి ఉండేది. అయితే ఇకపై ఆ రెండు లైసెన్స్‌లకు కలిపి ఒకే అప్లికేషన్ ఫామ్‌ను ఇచ్చేలా రవాణా శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా అప్లై చేసుకున్న 20 రోజుల్లోనే ఇంటికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుందట. కేంద్ర ప్రభుత్వం దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందని సమాచారం. అంతేకాకుండా రెన్యువల్ సమయంలో కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే విధంగా రవాణాశాఖ రూపకల్పన చేస్తోంది.

మరోవైపు రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించడానికి కేంద్రం ఇప్పటికే రూల్స్‌ను కఠినతరం చేయడమే కాకుండా బండి నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. కాగా, లైసెన్స్ పొందేందుకు కనీస అర్హతను 8వ తరగతికి తగ్గించిన సంగతి విదితమే.