ఒకే ఫ్రేమ్‌లో బాబాయ్, అబ్బాయి.. దర్శకుడిగా త్రివిక్రమ్..?

| Edited By: Pardhasaradhi Peri

Jan 31, 2020 | 10:18 AM

Good News To Nandamuri Fans: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారంటే అది ఫ్యాన్స్‌కు పండగే. అసలు ఈ ఇద్దరి హీరోల క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి ఓ మల్టీ‌స్టారర్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ పడటం ఖాయం. ఇక దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ త్వరలోనే […]

ఒకే ఫ్రేమ్‌లో బాబాయ్, అబ్బాయి.. దర్శకుడిగా త్రివిక్రమ్..?
Follow us on

Good News To Nandamuri Fans: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారంటే అది ఫ్యాన్స్‌కు పండగే. అసలు ఈ ఇద్దరి హీరోల క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి ఓ మల్టీ‌స్టారర్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ పడటం ఖాయం. ఇక దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారు. జూన్ రెండో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో బాలకృష్ణను ఓ కీలక పాత్రలో నటింపజేయాలని మాటల మాంత్రికుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తాడని సమాచారం. ఇక ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో పడ్డ త్రివిక్రమ్.. పూర్తికాగానే బాలయ్యకు కథ చెప్పి ఒప్పించాలని చూస్తున్నారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు గానీ.. నెట్టింట్లో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. ఏది ఏమైనా ఇదే గనక నిజమైతే ఎప్పటి నుంచో నందమూరి హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనుకుంటున్న అభిమానుల ఆశ నెరవేరినట్లే.