పొగాకు రైతులకు శుభ వార్త..!

లాక్ డౌన్ కార‌ణంగా తీవ్ర న‌ష్టాలు ఎదుర్కొంటొన్న వారిలో పొగాకు రైతులు కూడా ఉన్నారు. ఇత‌ర రైతులు ఉత్ప‌త్తుల‌ను రిటైల్ మార్కెట్ లో అమ్ముకునే వీలుంది. కానీ పొగాకు రైతుల‌కు ఆ సౌల‌భ్యం కూడా లేదు. మార్చి ఫ‌స్ట్ వీక్ లో జ‌ర‌గాల్సిన తొలి ద‌శ వేలం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. వేలం మ‌రింత ఆల‌స్య‌మైతే రైతులు మ‌రింత న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. దీంతో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు… పొగాకు బోర్డు ఆక్షన్ […]

పొగాకు రైతులకు శుభ వార్త..!

Updated on: Apr 25, 2020 | 2:37 PM

లాక్ డౌన్ కార‌ణంగా తీవ్ర న‌ష్టాలు ఎదుర్కొంటొన్న వారిలో పొగాకు రైతులు కూడా ఉన్నారు. ఇత‌ర రైతులు ఉత్ప‌త్తుల‌ను రిటైల్ మార్కెట్ లో అమ్ముకునే వీలుంది. కానీ పొగాకు రైతుల‌కు ఆ సౌల‌భ్యం కూడా లేదు. మార్చి ఫ‌స్ట్ వీక్ లో జ‌ర‌గాల్సిన తొలి ద‌శ వేలం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. వేలం మ‌రింత ఆల‌స్య‌మైతే రైతులు మ‌రింత న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. దీంతో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు… పొగాకు బోర్డు ఆక్షన్ కేంద్రాలు వెంటనే పొగాకు కొనుగోలును ప్రారంభించాలని కేంద్ర వాణిజ్య సెక్రటరీ అనూప్ వాధ్వాన్, కేంద్రహోమ్ సెక్రటరీ అజయ్ భల్లాతో మాట్లాడారు. వెంటనే చర్యలు తీసుకుంటామని వారు ఇద్దరూ భరోసా ఇచ్చిన‌ట్టు జీవీఎల్ ట్విట్టర్ లో వెల్ల‌డించారు.