Oneplus 5g Upgrade Days : వన్ ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్..5 జీ అప్ గ్రేడ్ డేస్ స్టార్ట్.. ఆ ఫోన్లపై భారీ తగ్గింపు..

వన్‌ప్లస్ ఫోన్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వన్‌ప్లస్ ఫోన్లను ఇష్టపడే వారు ఇతర ఆఫర్లతో కలిపి వన్‌ప్లస్ ఫోన్లను కొనడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం వన్ ప్లస్ బ్రాండ్ 5 జీ అప్‌గ్రేడ్ డేస్‌ను ప్రారంభించింది. మార్చి 21న ప్రారంభమైన ఈ సేల్ ఏప్రిల్ 2 వరకూ ఉంటుంది.

Oneplus 5g Upgrade Days : వన్ ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్..5 జీ అప్ గ్రేడ్ డేస్ స్టార్ట్.. ఆ ఫోన్లపై భారీ తగ్గింపు..
Oneplus Store
Follow us
Srinu

|

Updated on: Mar 25, 2023 | 6:30 PM

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా వన్‌ప్లస్ బ్రాండ్ ఫోన్స్‌ను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆ ఫోన్స్ వచ్చే కెమెరా క్వాలిటీతో పాటు ఇతర ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అయితే ఇతర ఫోన్స్‌తో పోల్చుకుంటే వన్‌ప్లస్ ఫోన్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వన్‌ప్లస్ ఫోన్లను ఇష్టపడే వారు ఇతర ఆఫర్లతో కలిపి వన్‌ప్లస్ ఫోన్లను కొనడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం వన్ ప్లస్ బ్రాండ్ 5 జీ అప్‌గ్రేడ్ డేస్‌ను ప్రారంభించింది. మార్చి 21న ప్రారంభమైన ఈ సేల్ ఏప్రిల్ 2 వరకూ ఉంటుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లపై అద్భుతమైన తగ్గింపు ధరలతో ఆకర్షనీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది.  ఈ ఆఫర్ కింద కస్టమర్లు తమ పాత 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్చుకుని, వనప్లస్ నుంచి నుండి సరికొత్త 5జీ  స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో అందుబాటులో ఉన్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

వన్ ప్లస్ 11 

వన్ ప్లస్ 11 ఇటీవలి కాలంలో కంపెనీ అందిస్తున్న తాజా ప్రీమియం స్మార్ట్‌ఫోన్. మీరు 4 జీ వన్ ప్లస్, ఐఓఎస్ డివైజ్‌లను కలిగి ఉంటే దాదాపు 5000 రూపాయల ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు. మరోవైపు ఇతర 4 జీ ఆండ్రాయిడ్ పరికరాలపై రూ.3000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికి వస్తే అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలోని అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్ ద్వారా 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో వస్తుంది. అలాగే వన్ కార్డ్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకూ తక్షణ తగ్గింపు వస్తుంది. ఐసీఐసీఐ పేపర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. 

వన్ ప్లస్ 11 ఆర్

ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3000 ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పొందవచ్చు. అలాగే వన్ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.1750 తక్షణ తగ్గింపు పొందవచ్చు. అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్స్ ద్వారా 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. ఐసీఐసీఐ పేపర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

వన్‌ప్లస్ 10 ప్రో

ఈ స్మార్ట్‌ఫోన్‌పై మీరు రూ. 10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందుతారు. వన్ కార్డ్  క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసినట్లయితే కొనుగోలుదారులు ఫోన్‌పై తక్షణ తగ్గింపు రూ. 2000 పొందుతారు. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలోని అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌లలో కొనుగోలుదారులు 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐను పొందుతారు. ఐసీఐసీఐ పేపర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. 

వన్ ప్లస్ 10 టీ

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా పొందుతారు. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్‌పై తక్షణం రూ.1500 తగ్గింపు పొందుతారు. ఐసీఐసీఐ పేపర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. 

వన్ ప్లస్ 10 ఆర్

ఈ స్మార్ట్‌ఫోన్‌పై మీరు రూ. 3,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందుతారు. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్‌పై రూ.1250 తక్షణ తగ్గింపు పొందుతారు. అమెజాన్, వన్ ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలోని అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌లలో కొనుగోలుదారులు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐను పొందుతారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?