చెన్నై విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు రూ. 41.5 లక్షల విలువైన బంగారాన్ని ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఇక్కడికి చేరుకున్న వీరి వాలకం అనుమానాస్పదంగా కనబడడంతో వెంటనే అరెస్టు చేశారు. వీరిలో ఒకరిని పదుకొట్టేకి చెందిన సిద్ధిక్ షేక్ అబ్దుల్లా, మరొకరిని రామనాథపురానికి చెందిన మహమ్మద్ గా గుర్తించారు. వీరు తమ శరీర ‘అంతర్భాగాల్లో’ గోల్డ్ పేస్ట్ రూపంలో దీన్ని దాచుకుని వఛ్చినట్టు అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో దుబాయ్ నుంచి చెన్నై వస్తున్న పలువురు బంగారాన్ని దొంగ రవాణా చేయడమే పనిగా పెట్టుకున్నారని వారు చెప్పారు. ఏమైనా.. నిఘాను మరింత పెంచుతున్నామన్నారు.