డౌన్ ఫాల్‌లో పసిడి రేటు

|

Mar 09, 2019 | 5:34 PM

దిల్లీ: అంతర్జాతీయంగా బంగారానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గటంతో వచ్చే వారం కూడా పసిడి ధరల పతనం కొనసాగవచ్చని తెలుస్తోంది. వెండి నాణేల తయారుదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి వెండి కొనుగోళ్లు తగ్గటంతో వెండి ధరలు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని సమాచారం. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడుతుండటం, అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ప్రతికూలంగా ఉండటం లాంటి కారణాల వల్ల బంగారం ధరలు తగ్గవచ్చని వర్తకులు […]

డౌన్ ఫాల్‌లో పసిడి రేటు
Follow us on

దిల్లీ: అంతర్జాతీయంగా బంగారానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గటంతో వచ్చే వారం కూడా పసిడి ధరల పతనం కొనసాగవచ్చని తెలుస్తోంది. వెండి నాణేల తయారుదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి వెండి కొనుగోళ్లు తగ్గటంతో వెండి ధరలు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని సమాచారం. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడుతుండటం, అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ప్రతికూలంగా ఉండటం లాంటి కారణాల వల్ల బంగారం ధరలు తగ్గవచ్చని వర్తకులు అంటున్నారు. ఈ వారం అమెరికన్‌ డాలర్‌తో రూపాయి విలువ 70.14గా ముగిసింది. ప్రపంచమార్కెట్‌లో ఒక ఔన్స్‌ బంగారం ధర 1,298.70 డాలర్లుగా, వెండి ధర ఒక ఔన్స్‌కు 15.31 డాలర్లుగా ఉంది. వారం చివరినాటికి దేశ రాజధాని దిల్లీలో 99గ్రాములు బంగారం ధర రూ.33,170 వద్ద స్థిరపడింది.