
తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. అక్షయ తృతీయ ఆఫర్ల జాతర జోరందుకుంది. సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు జువెల్లరీ షాప్‌లు బంపర్ ఆఫర్‌లు ప్రకటించాయి. అక్షయ తృతీయ రోజు తృణమో.. పణమో.. బంగారం కొంటే లచ్చిందేవి లగెత్తుకొస్తుందని.. అన్ని శుభాలు జరుగుతాయని.. మహిళలు బంగారం దుకాణాల దగ్గర బారులు తీరుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 32,620లుగా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల ధర రూ. 30,180లుగా ఉంది. ఎంతైనా కొనడానికి మాత్రం మహిళలు వెనకంజ వేయటం లేదు. ఇక.. దీనికి తోడుగా వెండి కేజీ ధర రూ.39,578 పలుకుతోంది.