Gold Price Today(21-02-2021) : కరోనా వైరస్ సమయంలో ఆల్ టైమ్ కు చేరుకున్న బంగారం ధరలు గత కొన్ని రోజులుగా దిగివస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఇక బడ్జెట్ లో బంగారం వెండికి కస్టమ్స్ సుంకం తగ్గించడంతో పసిడి ధర గణనీయంగా తగ్గుదల కనిపించింది. అయితే శనివారంతో పోలిస్తే ఆదివారం (ఫిబ్రవరి 21) ధరలు కొద్దిమేర పెరిగాయి.
ఈరోజు పసిడి ధరలు దేశీయంగా పెరుగుదల నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (21.02.2021) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొంచెం పెరిగింది. ఈరోజు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి మొత్తం పది గ్రాముల బంగారం ధర రూ.43,250లకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములు రూ. 280 మేర పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 47,180లకు చేరుకుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 43,250లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములు రూ. 280 పెరిగి.. రూ. 47,180 లకు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పసిడి ధర పెరిగింది. శనివారం తో పోలిస్తే ఈరోజు 22 క్యారెట్ల గ్రా. 10ల బంగారం ధర రూ. 250 పెరిగింది. దీంతో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర. రూ. 45,400లకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ధరతో పోలిస్తే రూ. 170లు పెరిగి పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,430 లకు చేరుకుంది.
ఈ ధరలు 21-02-2021 ఉదయం 8 గంటల సమయానికి ఉన్న ధరలు. కనుక మార్కెట్ లో ఏర్పడే పరిస్థితుల బట్టి పసిడి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. కనుక వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో మార్కెట్ లో బంగారం ధరపై అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: