Gold & Silver Price Today: మహిళకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న పసిడి ధర, స్థిరంగా వెండి.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

|

May 05, 2022 | 7:25 AM

Gold And Silver Price Today ( May 5th 2022): భారతీయులు(Indians) పసిడి ప్రేమికులు. బంగారాన్ని స్టేష్టన్ సింబల్ గానే కాదు.. తమ వద్ద ఉన్న బంగారంఎప్పుడైనా అనుకోని ఆర్ధిక కష్టాలు ఎదురైతే..

Gold & Silver Price Today: మహిళకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న పసిడి ధర, స్థిరంగా వెండి.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver
Follow us on

Gold And Silver Price Today ( May 5th 2022): భారతీయులు(Indians) పసిడి ప్రేమికులు. బంగారాన్ని స్టేష్టన్ సింబల్ గానే కాదు.. తమ వద్ద ఉన్న బంగారంఎప్పుడైనా అనుకోని ఆర్ధిక కష్టాలు ఎదురైతే.. తమను గట్టెక్కిస్తుందని భావించేవారు.. అయితే కాలంలో వచ్చిన మార్పులతో ఇప్పుడు బంగారం కొనుగోలుని ఒక పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. తమ జీవితంలో వచ్చే ప్రతి స్పెషల్ డే కి బంగారం, వెండి (gold and Silver) వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వడం సర్వసాధారంగా జరిగేదే. ఈ నేపథ్యంలో బంగారం, వెండిని కొనుగోలు చేయాలను కునే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో నేడు (మే 5వతేదీ  2022) గురువారం బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

పసిడి ధర క్రమంగా దిగి వస్తోంది. అయితే బంగారం ధర నిన్నటితో(04-05-2022 బుధవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం స్వల్పంగా తగ్గింది. అయితే వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. ఈరోజు ఉదయం (05-05-2022 గురువారం) బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,000 ఉంది. ఇక ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.51,280గా కొనసాగుతుంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,280గా ఉంది..ఇవే బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ కూడా కొనసాగుతున్నాయి.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు:
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉంది. ప్యూర్ గోల్డ్  24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,320గా ఉంది.

నేడు వెండి ధరలు: దేశీయంగా పసిడి ధర కొంతమేర తగ్గినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. మన దేశంలో బంగారం తర్వాత ఖరీదు చేసే లోహం వెండి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా బహుమతులు ఇవ్వడానికి వెండి వస్తువులను ఎంపిక చేసుకుంటారు.

ఓ వైపు దేశీయంగా బంగారం కొంతమేర దిగి వస్తే.. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.  కిలో వెండి ధర రూ.67,00లుగా ఉంది. ఇదే ధర తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. అయితే ముంబై, ఢిల్లీవంటి నగరాల్లో కిలో వెండి ధర 62,700లుగా ఉంది.

Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Funny Video: బ్యాక్‌బెంచర్‌ సివిల్‌ ఇంజనీర్‌ అయితే ఇలాగే ఉంటుంది మరి.. నవ్వులే నవ్వులు..!