గోదావరి బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

గోదావరి బోటు ప్రమాద దుర్ఘటనలో ఎనిమిదో రోజు ఒక్క మృతదేహమే లభ్యమైంది. సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. ఆదివారం ఉదయం దేవీపట్నం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిన్న లభ్యమైన ఐదేళ్ల బాలిక కుశాలి మృతదేహాన్ని ఇంకా బంధువులు తీసుకెళ్లలేదు. ఇప్పటి వరకు మొత్తం 37 మృతదేహాలు లభ్యం కాగా.. మరో 14 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం […]

గోదావరి బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

Updated on: Sep 22, 2019 | 9:31 PM

గోదావరి బోటు ప్రమాద దుర్ఘటనలో ఎనిమిదో రోజు ఒక్క మృతదేహమే లభ్యమైంది. సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. ఆదివారం ఉదయం దేవీపట్నం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిన్న లభ్యమైన ఐదేళ్ల బాలిక కుశాలి మృతదేహాన్ని ఇంకా బంధువులు తీసుకెళ్లలేదు. ఇప్పటి వరకు మొత్తం 37 మృతదేహాలు లభ్యం కాగా.. మరో 14 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77 మంది ఉండగా.. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైనవారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us