AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

42 ఏళ్ల బంధానికి కన్నీటి వీడ్కోలు.. పెళ్లికూతురిలా భార్యను అలంకరించి.. పెళ్లికొడుకుగా భర్త తుది వీడ్కోలు!

భార్యాభర్తల అనుబంధం ఎంత బలమైనదో చాటిచెప్పే హృదయవిదారక ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లో చోటుచేసుకుంది. నాలుగు దశాబ్దాలకు పైగా జీవితాన్ని కలిసి సాగించిన భార్య కన్నుమూయడంతో.. ఆమెకు భర్త వినూత్న రీతిలో తుది వీడ్కోలు పలికారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

42 ఏళ్ల బంధానికి కన్నీటి వీడ్కోలు.. పెళ్లికూతురిలా భార్యను అలంకరించి.. పెళ్లికొడుకుగా భర్త తుది వీడ్కోలు!
Husband Wife Emotional Farewell
Balaraju Goud
|

Updated on: Sep 26, 2026 | 8:46 AM

Share

రాజస్థాన్‌: భార్యాభర్తల అనుబంధం ఎంత బలమైనదో చాటిచెప్పే హృదయవిదారక ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లో చోటుచేసుకుంది. నాలుగు దశాబ్దాలకు పైగా జీవితాన్ని కలిసి సాగించిన భార్య కన్నుమూయడంతో.. ఆమెకు భర్త వినూత్న రీతిలో తుది వీడ్కోలు పలికారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

బికనీర్‌లోని గంగాశహర్ రోడ్డులో నివసించే రిటైర్డ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ జోషి భార్య అమితా జోషి (63) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

అమితా జోషికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆమెకు చివరి వీడ్కోలు సాధారణంగా కాకుండా.. వివాహ సమయంలో ఎలా అలంకరించారో అదే తరహాలో ఇవ్వాలని భర్త రాజేంద్ర జోషి నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు అమితా జోషిని ఎరుపు రంగు పెళ్లి దుస్తులతో ముస్తాబు చేసి, ఆభరణాలు ధరింపజేశారు.

తన భార్యకు తుది వీడ్కోలు పలికేందుకు రాజేంద్ర జోషి కూడా పెళ్లికొడుకు దుస్తులు ధరించారు. అనంతరం అంత్యక్రియల ఊరేగింపు ప్రారంభమైంది. సాధారణంగా అంతిమయాత్రలో వినిపించే విషాద గీతాలకు బదులుగా వివాహ వేడుకల్లో వినిపించే పాటలను బ్యాండ్ బృందం ఆలపించింది. కుటుంబ సభ్యులు, బంధువులు రామనామ సంకీర్తన చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.

ఊరేగింపు మోక్షధామ్‌కు చేరుకున్న తర్వాత రాజేంద్ర జోషి భావోద్వేగానికి గురయ్యారు. భార్యను చివరిసారిగా చూసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యం అక్కడున్న బంధువులు, స్నేహితులు, స్థానికులను కూడా కదిలించింది.

రాజేంద్ర జోషి, అమితా జోషిల వివాహం 1984 ఫిబ్రవరి 18న ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగింది. దాదాపు 42 ఏళ్ల వైవాహిక జీవితంలో తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమతో చూసుకున్నారని రాజేంద్ర జోషి గుర్తుచేసుకున్నారు. ఈ దంపతులకు అమిత్, అభిషేక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు ఇంజనీర్ కాగా, మరొకరు పశువైద్యుడిగా పనిచేస్తున్నారు. అమితా జోషి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్థానికులు, మాజీ సహోద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us