Gauva for health: జామతో అద్భుతమైన ఆరోగ్యం!

| Edited By:

Feb 17, 2020 | 5:36 PM

Gauva for health: జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో… జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. జామ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటి ఆక్సిడేంట్ గా ఉపయోగపడుతుంది. జామపండు తినడం వల్ల గ్యాస్ట్రిక్‌, అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి. తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. జామచెట్టు బెరడుతో కాసిన డికాషన్‌ తాగడం వల్ల పొట్టలోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి. తరచూ జామకాయ తినేవారికి మలబద్దక […]

Gauva for health: జామతో అద్భుతమైన ఆరోగ్యం!
Follow us on

Gauva for health: జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో… జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. జామ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటి ఆక్సిడేంట్ గా ఉపయోగపడుతుంది. జామపండు తినడం వల్ల గ్యాస్ట్రిక్‌, అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి. తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. జామచెట్టు బెరడుతో కాసిన డికాషన్‌ తాగడం వల్ల పొట్టలోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి. తరచూ జామకాయ తినేవారికి మలబద్దక సమస్యలు ఏర్పడవు.

జామ పండు కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది. చాలామంది బలహీనంగా ఉంటుంటారు. ఇలాంటి వారు జామలోని గింజలను తీసి ఆ గుజ్జును పాలు, తేనెతో కలిపి తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతారు. ఇందులోని విటమిన్‌ సి, క్యాల్షియం శారీరకంగా దృఢంగా మారుస్తుంది. రోజూ రెండు, మూడు లేత జామ ఆకులు నమిలితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. జామ తినడం వల్ల క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్‌, గుండె బలహీనత, కామెర్లు, హెపటైటిస్‌, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు దూరం అవుతాయి.

జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది. నోటి సమస్యలు, చిగుళ్లు, దంత సమస్యలతో బాధపడే వారు తరచూ జామకాయలు తింటే ఆ సమస్యల్ని దూరం చేసుకున్న వారవుతారు. కాలిన గాయాలతో బాధపడే వారు గుజ్జును ఆ ప్రాంతంలో రాయడం వల్ల ఉపశమనం పొందుతారు. మహిళల్లో గర్భ సమయంలో వాంతుల సమస్య ఎదురవుతుంది. అలాంటప్పుడు జామ చాలా బాగా పనిచేస్తుంది.