బ్రేకింగ్: కర్నూలులో విషవాయువు లీకేజ్.. ఒకరు మృతి

కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో అమ్మోనియా విషవాయువు లీక్ అయింది. దీంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.

బ్రేకింగ్: కర్నూలులో విషవాయువు లీకేజ్.. ఒకరు మృతి

Edited By:

Updated on: Jun 27, 2020 | 12:02 PM

Gas Leak in SPY Agro Industries: కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో అమ్మోనియా విషవాయువు లీక్ అయింది. 2 టన్నుల సామర్థ్యమున్న అమ్మోనియా ట్యాంకర్ లో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ జీఎం శ్రీనివాసులు మృతిచెందారు. మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నంద్యాల వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్యాస్ ప్రభావంతో కొందరు అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే అంబులెన్సులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. కంపెనీ సిబ్బంది గ్యాస్ లీకేజిని అదుపుచేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: ఆ రాష్ట్రంలో జులై 31వరకు లాక్‌డౌన్..