Health Benefits of Garlic: ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారు. డయాబెటిస్ వలన ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. మానసిక సమస్యల నుంచి శారీరక సమస్యల వరకూ అన్ని రోగాలు వేధిస్తున్నాయి. అయితే.. ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు.. ఆహారం నుంచి జీవన విధానం వరకు అనేక విషయాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి. సరైన డైట్ పాటించడం వలన దీని బారి నుంచి సులువుగా తప్పించుకోవచ్చంటున్నారు నిపుణులు.. అయితే అలాంటి వాటిలో వెల్లుల్లి దివ్యమైన ఔషధమని పేర్కొంటున్నారు. వెల్లుల్లి డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడమే కాకుండా.. ఎన్నో సమస్యలకు సర్వరోగనివారణిగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.
వెల్లుల్లి ద్వారా డయాబెటిస్ పేషెంట్లు ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
• వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి రోగ నిరోధకశక్తిని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
• డయాబెటిస్ పేషెంట్లు నిత్యం వెల్లుల్లితో కూడిన ఆహారాన్ని, లేదా పానీయాలను తయారుచేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.
• ముఖ్యంగా వెల్లులి రెబ్బలు తినడం కానీ.. లేదా వెల్లుల్లి మెత్తగా నూరి ఉడకబెట్టిన నీళ్లల్లో కలుపుకోని తాగవచ్చు.
• దీంతోపాటు.. ఉల్లి రసం, నిమ్మ రసం, అల్లం రసం తీసుకుని వెల్లుల్లి రసంలో కలపాలి.. ఆ తర్వాత వీటి మిశ్రమాన్ని ఉడికించి.. కొంచెం తేనె కలుపుకొని తాగితే మంచిది.
• ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఉండటం వలన శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
• దీంతోపాటు హార్ట్ బ్లాక్ వంటి సమస్యలు కూడా తలెత్తవని పేర్కొంటున్నారు.
• శరీరం వేడి చేసి ఉంటే రాత్రంతా వెల్లుల్లి నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. ఆ నీరు తాగాలి.
Also Read: