యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ హతం!

| Edited By:

Aug 09, 2020 | 5:57 PM

లక్నోలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) గ్యాంగ్‌స్టర్ రాకేశ్ పాండే ఎన్కౌంటర్ చేసారు. యూపీలో గ్యాంగ్ స్టర్ ల ఏరివేత కొనసాగుతోంది.

యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ హతం!
Follow us on

లక్నోలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) గ్యాంగ్‌స్టర్ రాకేశ్ పాండే ఎన్కౌంటర్ చేసారు. యూపీలో గ్యాంగ్ స్టర్ ల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసులను చంపడంతో అతడిని పోలీసులు మట్టుపెట్టారు. ఆ తరవాత యూపీలో గ్యాంగ్ స్టర్ లను ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వికాస్ దూబే అనుచరులను సైతం పోలీసులు ఎన్కౌంటర్ చేసారు.

వివరాల్లోకెళితే.. లక్నో శివారులో రాకేశ్ పాండే ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దాంతో అతడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. 1993 నుండి పాండే నేరాలు చేయటం ప్రారంభించాడు. 2005లో బీజేపీ నేత కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ఇతడు ప్రధాన నిందితుడు. మరోవైపు యూపీలోని కిరాతక గ్యాంగ్ ముక్తార్ అన్సారీ అనే గ్యాంగ్ లో రాకేష్ పాండే సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2010 నుండి పాండే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అప్పటినుండి అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!