FSSAI New Rule: కాలం చెల్లిన స్వీట్లకు ఇక చెల్లు.. జూన్ 1 నుంచి కొత్త రూల్..

|

Feb 26, 2020 | 2:53 PM

లూజ్ ప్యాకెట్లలో అమ్మే స్వీట్లపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిబంధన తీసుకొచ్చింది. ఇకపై స్వీట్ షాపుల యజమానులు, మిఠాయి తయారీదారులు నాన్ ప్యాకేజ్డ్ స్వీట్స్‌పై మ్యాన్‌ఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్ పైరీ డేట్లను ఖచ్చితంగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. 

FSSAI New Rule: కాలం చెల్లిన స్వీట్లకు ఇక చెల్లు.. జూన్ 1 నుంచి కొత్త రూల్..
Follow us on

FSSAI New Rule: లూజ్ ప్యాకెట్లలో అమ్మే స్వీట్లపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిబంధన తీసుకొచ్చింది. ఇకపై స్వీట్ షాపుల యజమానులు, మిఠాయి తయారీదారులు నాన్ ప్యాకేజ్డ్ స్వీట్స్‌పై మ్యాన్‌ఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్ పైరీ డేట్లను ఖచ్చితంగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది.

Also Read: Polluted India:కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!

దీని బట్టి ఇక నుంచి లూజ్ ప్యాకెట్ స్వీట్లపై.. వాటిని ఎప్పుడు తయారు చేశారు… ఎన్ని రోజులు అవి ఫ్రెష్‌గా ఉంటాయన్న వివరాలను ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ నిబంధన  ప్యాకేజ్డ్ స్వీట్లకు మాత్రమే వర్తించగా.. ఇకపై విడిగా అమ్మే మిఠాయిలకు కూడా వర్తిస్తుంది. 2020 జూన్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.

Also Read: జగనన్న విద్యాదీవెన కార్డుపై సూపర్ స్టార్ ఫోటో.. ఏంటా కథ.?

చాలా షాపుల్లో కాలం చెల్లిన స్వీట్లు అమ్ముతున్నారని.. దాని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. కాగా, జూన్ 1 నుంచి అమలు కానున్న ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.