ఈ నెల 20 నుంచి ఉచిత రేషన్… బియ్యంతోపాటు శనగలు

కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ఈ నెల 20 నుంచి ఉచిత సరుకులను పంపిణీ చేయనున్నారు. పౌర సరఫరాల సంస్థ ఏపీలోని అన్ని రేషన్‌ షాపులకు సరుకులను సరఫరా చేసింది...

ఈ నెల 20 నుంచి ఉచిత రేషన్... బియ్యంతోపాటు శనగలు

Updated on: Oct 19, 2020 | 12:45 AM

Free Ration Distribution : కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ఈ నెల 20 నుంచి ఉచిత సరుకులను పంపిణీ చేయనున్నారు. పౌర సరఫరాల సంస్థ ఏపీలోని అన్ని రేషన్‌ షాపులకు సరుకులను సరఫరా చేసింది.
నెలకు 2 విడతలు చొప్పున ఏప్రిల్‌ కోటా నుంచి ప్రారంభించి.. ఇప్పటికి 13 సార్లు పంపిణీని పూర్తిచేశారు. ఈ విడతలో లబ్ధిదారులకు బియ్యం, శనగలు కూడా అందించనున్నారు.

ఇప్పటికే కార్డులుండి వివిధ కారణాలతో అనర్హులుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అనర్హులుగా పరిగణించిన కార్డుదారుల్లో ఎక్కువ మంది తాము అర్హులమేనని, ఒక కుటుంబ సభ్యుడు ఆదాయపు పన్ను చెల్లిస్తే మొత్తం కార్డునే రద్దు చేశారంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి వెళ్లడంతో సమస్యను వెంటనే పరిష్కరించారు. దీంతో 70 వేల కుటుంబాలకు కొత్తగా కార్డులు మంజూరయ్యాయి.