పుల్వామా ఎన్‌కౌంటర్‌లో నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ పోలీసులు అక్కడకు సోమవారం తెల్లవారుజామున చేరుకున్నారు. ఇండియన్ ఆర్మీ 44 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా లాసీపొరలో నిర్భంద తనిఖీలు […]

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

Edited By:

Updated on: Apr 01, 2019 | 10:53 AM

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ పోలీసులు అక్కడకు సోమవారం తెల్లవారుజామున చేరుకున్నారు. ఇండియన్ ఆర్మీ 44 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా లాసీపొరలో నిర్భంద తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జర‌పడంతో ఎన్‌కౌంటర్‌గా మారింది. ఆ ఉగ్రవాదుల‌ నుంచి రెండు ఏకే రైఫిల్స్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరిని లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.