మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు? మోదీకి ఆహ్వానం..?

| Edited By:

Aug 09, 2020 | 12:17 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది.ఈ క్రమంలో ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు

మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు? మోదీకి ఆహ్వానం..?
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది.ఈ క్రమంలో ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రభుత్వం ముహూర్తం ఖరారుచేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని భావిస్తోంది. రాజధానుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆగస్టు 16న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించేందుకు సీఎం జగన్ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరారు.

2022 నాటికి అందరికీ సొంత ఇళ్లు ఉండాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదల కోసం ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుండటంతో వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 26 వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఔట్లు వేసి పట్టాల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!