తొలి టెస్ట్: పాకిస్థాన్‌ను చిత్తుచేసిన ఇంగ్లాండ్..

మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ మూడు వికెట్లతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

  • Ravi Kiran
  • Publish Date - 12:03 pm, Sun, 9 August 20
తొలి టెస్ట్: పాకిస్థాన్‌ను చిత్తుచేసిన ఇంగ్లాండ్..

England Vs Pakistan 1st Test: మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ మూడు వికెట్లతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ 209 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో పాక్ 109 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. కేవలం 169 పరుగులకే ఆలౌట్ అయింది. దానితో ఇంగ్లాండ్ జట్టుకు 277 పరుగుల టార్గెట్ నిర్దేశించబడింది.

లక్ష్యచేధనలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ మొదటి 5 వికెట్లను త్వరగా కోల్పోయింది. అయితే జోస్ బట్లర్(75), క్రిస్ వోక్స్(84) హాఫ్ సెంచరీలతో ఆతిధ్య జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో యాసిర్ షా నాలుగు వికెట్లు సాధించగా.. షాహిన్ ఆఫ్రిది, అబ్బాస్, నసీం షా చెరో వికెట్ పడగొట్టారు.