
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో టీడీపీ నేత ఇంటి ముందు వైసీపీ నాయకులు బండలు పెట్టిన చర్యపై ఆరా తీసేందుకు గ్రామానికి వెళ్తుండగా.. జేసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని వెంకటాపురం గ్రామంలోని టీడీపీ నేత నాగరాజు ఇంటికి అడ్డుగా.. వైసీపీ నాయకులు బండలు నాటిన విషయంపై ఆరా తీసేందుకు మాజీ ఎంపీ జేసీ, మాజీ ఎమ్మెల్యే యామిని తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. గ్రామానికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకుని.. స్టేషన్‌కు తరలించారు. దీంతో.. పోలీసుల తీరుపై దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ అరెస్ట్ తీరును తప్పుడు పడుతూ.. టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో.. స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏరపడ్డాయి.
తాజాగా.. ఈ విషయంపై ముడు రోజులుగా.. వెంకటాపురం గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు ఎంత నివారించినా.. గొడవలు సద్దుమణగడం లేదు. అందులోనూ ఇప్పుడు.. జేసీ అక్కడికి చేరుకుంటే.. మరిన్ని గొడవలు జరుగుతాయనే.. కారణంతోనే జేసీని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.