కోడెల మృతితో భావోద్వేగానికి గురైన చంద్రబాబు..!

| Edited By:

Sep 16, 2019 | 5:53 PM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఈరోజు మృతి చెందారు. ఈ విషయాన్ని బసవతారం ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఉరి వేసుకుని.. ఆఖరి శ్వాసలో ఆయన ఉండగా.. కోడెలను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే బసవతారకం హాస్పిటల్‌కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కోడెల తట్టుకోలేకపోయారని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు, కోడెల సన్నిహితులు తెలిపారు. కాగా.. కోడెల శివప్రసాద రావు మృతి పట్ల మాజీ […]

కోడెల మృతితో భావోద్వేగానికి గురైన చంద్రబాబు..!
Follow us on

ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఈరోజు మృతి చెందారు. ఈ విషయాన్ని బసవతారం ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఉరి వేసుకుని.. ఆఖరి శ్వాసలో ఆయన ఉండగా.. కోడెలను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే బసవతారకం హాస్పిటల్‌కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కోడెల తట్టుకోలేకపోయారని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు, కోడెల సన్నిహితులు తెలిపారు. కాగా.. కోడెల శివప్రసాద రావు మృతి పట్ల మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి వార్త తెలియగానే.. చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మాజీ స్పీకర్ కోడెల.. ఏన్నో ఏళ్లుగా.. టీడీపీలో కొనసాగారని.. తనకు క్లిష్ట పరిస్థితుల్లో తోడుగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు.