
మూగ జీవాల పట్ల కొందరు మూర్ఖులు అతి కిరాతకంగా ప్రవర్తిస్తూ వాటిని ప్రాణాలను తీస్తున్నారు. మొన్న కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును పేలుడు పదార్థాలు పెట్టి చంపితే, నిన్న ఏపీలో ఓ ఆవుకు నాటుబాంబు పెట్టి చావుకు కారణమయ్యారు. అయితే, అందుకు భిన్నంగా వాటర్ బ్యారేజ్ లో పడ్జ జింకపిల్లను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ ఫారెస్టర్స్. ఇంకా మనుషుల్లో మానవత్వం దాగి ఉందనడానికి ఇదో ఉదాహరణ. అడవుల రక్షణతో పాటు వన్యప్రాణులను రక్షించే బాధ్యతలు నిర్వహిస్తున్న ఫారెస్టర్స్ చేసిన సాహసానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ ట్విటర్‌లో షేర్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని గంగా బ్యారేజీలో పడి ఒక జింక ఇరుక్కుపోయింది. దీనిని హైదర్పూర్‌కు చెందిన చిత్తడి నేల ఫారెస్టర్ శ్రీ మోహన్ యాదవ్ ప్రాణాలకు తెగించి రక్షించారు. ఒక వ్యక్తి పైన ఉండి కిందకి తాడు సాయంతో ఫారెస్టర్ దిగి చెత్తనంతా తొలిగించి జింకను కాపాడాడు. చిత్తడి జింకలను కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన పచ్చని యోధులను అభినందిస్తూ ట్విట్టర్ లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ షేర్ చేశారు. మన అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి ఇలాంటి వారు దేశవ్యాప్తంగా పగలు, రాత్రులు పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటవీ సిబ్బంది నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
He risks his life to save the swamp deer. Such green warriors are working day and night across the country to protect our forests and wildlife. They work for the voiceless. Let us voice to appreciate and recognise their efforts.
Via @rameshpandeyifs Sir pic.twitter.com/B4lpyLluoM
— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) June 30, 2020