వాసాలమర్రి గ్రామంపై అధికారుల ఫోకస్.. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

వాసాలమర్రి గ్రామంపై తెలంగాణ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆ గ్రామంలో ఫారెస్ట్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యటించారు.

వాసాలమర్రి గ్రామంపై అధికారుల ఫోకస్.. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

Updated on: Nov 13, 2020 | 4:06 PM

FAPCC VIST CM KCR Dattata Village : వాసాలమర్రి గ్రామంపై తెలంగాణ అధికారులు  స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆ గ్రామంలో ఫారెస్ట్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న పురాతన లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు.

సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న పురాతన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.