Foreign Liquor Online Sale:మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై ఆన్లైన్‌లో ఫారెన్ లిక్కర్..!

ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్నారు. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఫుడ్ వరకు అన్నింటిని ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాలను ఆన్లైన్ చేస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Foreign Liquor Online Sale:మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై ఆన్లైన్‌లో ఫారెన్ లిక్కర్..!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 25, 2020 | 3:20 PM

Foreign Liquor In Online: ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్నారు. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఫుడ్ వరకు అన్నింటిని ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న ఈ-కామర్స్ బిజినెస్‌కు ఆధారంగా మద్యం సేల్స్‌ను కూడా వృద్ధి చేయడానికి లిక్కర్ ఇండస్ట్రీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాలను ఆన్లైన్ చేస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగానే కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చి ఆన్‌లైన్‌‌లో ఫారెన్ లిక్కర్ అమ్మకాలకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Also Read: వింత వైరస్ ఎఫెక్ట్: 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..

దీని బట్టి చూస్తుంటే ఇది మందుబాబులు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటివరకు మద్యం షాపుల వద్ద క్యూ కట్టిన వాళ్లు ఇకపై ఇంటి దగ్గర కూర్చునే ఆన్‌లైన్‌ ద్వారా లిక్కర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ విధానం రాష్ట్ర ఆదాయానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అటు మద్యం అమ్మకాలను ఆన్లైన్ ద్వారా చేస్తే గతంలో కంటే గణాంకాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, కొంతమంది మద్యం అమ్మకాలను ఆన్లైన్ చేస్తే ప్రమాదం తప్పదని ఆందోళన చెందుతున్నారు.

Also Read: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!

Also Read: who is the lady accompanying donald trump melania and narendra modi