కేంద్ర బడ్జెట్‌పై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రానున్న కాలంలో దేశ ముఖచిత్రాన్ని మార్చివేసేలా ఉందన్నారు రాజ్‌నాథ్ సింగ్. కేంద్ర బడ్జెట్‌పై ఆయన ప్రశంసలజల్లు కురిపించారు. ఈ బడ్జెట్ అన్నివర్గాల వారికి ఎంతో మేలుచేయనుందన్నారు. దీన్ని సామాజిక, ఆర్ధికాంశాల్లో మార్పులకు శ్రీకారం చుట్టేలా తీర్చిదిద్దారని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని రూపొందించారన్నారు రాజ్‌నాథ్.
దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి ఎదిగేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన తరగతులు, సంపన్న వర్గాలు,అట్టడుగు వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఎంతో మేలు జరగనుందని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
Inspired by the mantra of ‘Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas’ the Union Budget 2019-20 has not only outlined the vision for ‘New India’ but it is also focused on bringing a qualitative change in people’s lives.
— Rajnath Singh (@rajnathsingh) July 5, 2019