
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళ్తే..తమిళనాడులోని సేలం జిల్లాలోని కురుంగచావడి గ్రామంలో అన్బళగన్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. రోజూ లాగానే గత రాత్రి కూడా వారు నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున గాడ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో వారు తప్పించుకోడానికి కూడా వీలు లేకపోయింది. దీంతో అన్బళగన్ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అన్బళగన్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :
ఐటీబీపీకి హోంశాఖ ఆర్డర్స్ , హైఅలర్ట్
దిగొచ్చిన బంగారం, వెండి ధరలు : తాజా రేట్లు ఇలా !