Breaking : పార్లమెంట్‌ అనెక్స్‌ భవనంలో చెలరేగిన మంటలు

|

Aug 17, 2020 | 9:43 AM

ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనం ఆరవ అంతస్తులో ఈ రోజు ఉదయం మంటలు చెలరేగాయి. వెంట‌నే ఏడు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

Breaking : పార్లమెంట్‌ అనెక్స్‌ భవనంలో చెలరేగిన మంటలు
Follow us on

ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనం ఆరవ అంతస్తులో ఈ రోజు ఉదయం మంటలు చెలరేగాయి. వెంట‌నే ఏడు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

“ఉదయం 7.30 గంటలకు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ వచ్చింది. షార్ట్ సర్క్యూట్ తరువాత మంటలు ప్రారంభమయ్యాయని భావిస్తున్నాం. ప్ర‌స్తుతం మంట‌లు అదుపులోకి వచ్చాయి” అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.

Also Read :

పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు

పెరిగిన‌ వరద ఉదృతి : క‌డెం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత‌