Malabar Express : మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులను దించేసిన అధికారులు..

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళూరు-తిరువనంతపురం మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలు పార్శిల్ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి...

Malabar Express : మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులను దించేసిన అధికారులు..

Updated on: Jan 17, 2021 | 10:24 AM

Malabar Express : మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళూరు-తిరువనంతపురం మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలు పార్శిల్ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడం తో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను వెంటనే రైలు నుంచి దించేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం ప్రకారం.. వర్కోలా, పరపూర్‌ స్టేషన్ల మధ్య ఎడావ వద్ద ఉదయం 7.40 గంటల సమయంలో లోకో పైలట్ రైలు ముందు భాగంలోని పార్శిల్ వ్యాన్‌లో నుంచి పొగరావడం గుర్తించారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలిసి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆలయాలపై దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఏపీ పర్యటన షురూ.. ఈ నెల 28 వరకు 5 జిల్లాల్లో యాత్ర