విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమదం విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు. ఈ పోర్టులోని వెస్ట్ క్యూ బెర్త్ వద్ద హెచ్ఎన్సీ క్రేన్ దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. అగ్నిప్రమాదం సమాచారంతో పోర్టు అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఆస్తి నష్టం వివరాలను పోర్టు అధికారులు ఇంకా వెల్లడించలేదు.