దీపావళి వేడుకల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విషాదం నింపాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో దీపావళి బాణసంచా భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారం దగ్ధమైంది. దాదాపు 1200 కోళ్లు మంటల్లో కాలిపోయాయి. సుమారు నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారం ఓనర్ ఆవేధన వ్యక్తం చేశాడు వాపోయాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక హైదరాబాద్‌లో సాయినాథ్ గంజ్ పోలీసుస్టేషన్ పరిధి బేగంబజార్‌లోని నవభారత్ ట్రాన్స్‌పోర్ట్ గోదాంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి పండుగ సందర్భంగా కాల్చిన తారాజువ్వలు గోదాంలోని కేబుల్ వైర్లపై పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, సాయినాథ్ గంజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను రెండు ఫైర్ ఇంజన్లతో అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని… లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు గోదాం ఓనర్ పేర్కొన్నారు.
Also Read :
పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై సీఎం ఫోకస్, నేడు సంబంధిత అధికారులతో కీలక భేటీ
నేడు బిహార్లో ఎన్డీయే పక్షాల సమావేశం, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ, ఆ ఫార్ములాలతో ముందుకు !