ఈపీఎఫ్‌ఓకు ఆర్థిక శాఖ ఝలక్!

ఆర్థికమంత్రిత్వశాఖ సామాజిక భద్రత, పెన్షన్‌ ఫండ్‌పై ఇచ్చే వార్షిక వడ్డీరేటును 8.65 శాతం నుంచి తగ్గించాలని ఈపీఎఫ్‌ఓను ఆదేశిం చింది. దీనికి ప్రధాన కారణం.. ఈపీఎఫ్‌ఓ పెట్టుబ డిన పెట్టుబడులపై పెద్దగా రాబడి రాకపోవడం ఒక కారణ మైతే.. మరో అంశం పీఎఫ్‌ ఖాతాదారు లకు పెద్దమొ త్తంలో వడ్డీరేటు ఆఫర్‌ చేస్తే బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వ లేవని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కాగా […]

ఈపీఎఫ్‌ఓకు ఆర్థిక శాఖ ఝలక్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2019 | 8:06 PM

ఆర్థికమంత్రిత్వశాఖ సామాజిక భద్రత, పెన్షన్‌ ఫండ్‌పై ఇచ్చే వార్షిక వడ్డీరేటును 8.65 శాతం నుంచి తగ్గించాలని ఈపీఎఫ్‌ఓను ఆదేశిం చింది. దీనికి ప్రధాన కారణం.. ఈపీఎఫ్‌ఓ పెట్టుబ డిన పెట్టుబడులపై పెద్దగా రాబడి రాకపోవడం ఒక కారణ మైతే.. మరో అంశం పీఎఫ్‌ ఖాతాదారు లకు పెద్దమొ త్తంలో వడ్డీరేటు ఆఫర్‌ చేస్తే బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వ లేవని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

కాగా ఈపీఎఫ్‌వో ఇప్పటికే పీఎఫ్ అకౌంట్‌పై 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటు అందించాలని ప్రతిపాదించింది.అయితే వడ్డీ రేటు పెంపు నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని ఆర్థిక శాఖ తాజాగా ఈపీఎఫ్‌వోను కోరినట్లు తెలుస్తోంది. నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిపోవడంతో బ్యాంకులు రుణ రేట్లను తగ్గించేందుకు ఇష్టపడటం లేదు. అలాగే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందించే అవకాశాలులేవు. ఈపీఎఫ్‌వో సహా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ రేట్ల తగ్గుదల వల్ల నిధుల సమీకరణ కష్టతరమౌతుందని బ్యాంకులు పేర్కొంటున్నాయి.