Film Making In GOA :ఇకపై గోవాలో ఫిల్మ్ షూటింగ్‌కి నిబంధనలు కఠినతరం కానున్నాయి. రాష్ట్ర ఇమేజ్‌కు హాని చేయని సినిమాలకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. స్క్రిప్ట్‌లను మొదట ఒక కమిటీకి చూపించాల్సి ఉంటుందని, షూటింగ్‌కు అనుమతి ఇవ్వడానికి ముందే పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మోహిత్ సూరి చిత్రం మలంగ్‌లో గోవాను డ్రగ్స్ కేంద్రంగా ప్రొజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
“ఇకపై, సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చేటప్పుడు ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా కథను తనిఖీ చేస్తుంది. వారు క్షుణ్ణంగా పరిశీలనలు జరిపి గోవా ఇమేజ్‌ను అపహాస్యం చేయడం లేదని భావించినప్పుడే అనుమతి ఇస్తాము ”అని పేర్కొన్నారు. ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా అనేది నోడల్ ఏజెన్సీ. రాష్ట్రవ్యాప్తంగా జరిగే షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు వివిధ ఇతర రాష్ట్ర సంస్థలతో సమన్వయం చేయడం దాని బాధ్యత.
ఇది కూడా చదవండి : ఇండియన్ ఉసేన్ బోల్ట్‌కు ఊహించని ఆఫర్…