జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి సినీరంగ ప్రస్థానం

రాయలసీమ యాసలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్ రెడ్డి మరణం సినీ రంగానికి తీరనిలోటు. విల‌న్‌గా, క‌మెడీయ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ జగతిలో చెరగని ముద్ర వేసుకున్నారు జయప్రకాశ్ రెడ్డి

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి సినీరంగ ప్రస్థానం
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: Sep 08, 2020 | 10:27 AM

రాయలసీమ యాసలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్ రెడ్డి మరణం సినీ రంగానికి తీరనిలోటు. విల‌న్‌గా, క‌మెడీయ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ జగతిలో చెరగని ముద్ర వేసుకున్నారు జయప్రకాశ్ రెడ్డి మరణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న మ‌ర‌ణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. కుర్ర హీరోల‌తో పాటు సీనియ‌ర్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసిన అనుభవం ఆయనది. 32 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. జయప్రకాష్ చివ‌రిసారిగా కనిపించిన చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలో జయప్రకాష్ రెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయ‌న తండ్రి సాంబిరెడ్డియాదృచ్ఛిక పేజీ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేశారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇతడు పదోతరగతిలో ఉండగా తండ్రికి అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండే జయప్రకాష్ రెడ్డి పాఠశాల దశలోనే చిన్న చిన్న నాటకాల్లో నటించారు.

జ‌య ప్ర‌కాశ్ రెడ్డి తండ్రి కూడా న‌టుడే కావడంతో జయప్రకాష్ రెడ్డి మంచి సపోర్ట్ దొరికింది. తండ్రి కొడుకులు క‌లిసి ప‌లు నాట‌కాల్లో కూడా నటించారు. చ‌దువులోను చుర‌కుగా ఉండే జ‌య‌ప్ర‌కాశ్ డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. అయితే, త‌ను చ‌దుకునే స‌మ‌యంలో ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి టపటపా అప్పజెప్పేశారు. చిన్నతనంలోనే జ‌య‌ప్ర‌కాశ్ నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు.