Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భారత్ అంకుల్ ఆన్సర్‌కి కొరియన్ అమ్మాయి మైండ్ బ్లాంక్ అయింది..

ఈ మధ్య యూట్యూబర్స్ సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లి అక్కడి ఆచార సంప్రదాయాలు, జీవన విధానాలు, ఫుడ్, కల్చర్ వంటి వాటిని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. అలానే భారత్‌కు ఇతర దేశాల నుంచి చాలామంది వ్లాగర్స్, ఇన్‌ప్లూయన్సర్స్ వస్తున్నారు. తాజాగా ఓ కొరియన్ వ్లాగర్‌క మన వద్ద ఊహించని అనుభవం ఎదురైంది.

Viral: భారత్ అంకుల్ ఆన్సర్‌కి కొరియన్ అమ్మాయి మైండ్ బ్లాంక్ అయింది..
Korean YouTuber 'potatoturtleee
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2025 | 9:46 PM

భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక దక్షిణ కొరియా యూట్యూబర్ రోడ్డు పక్కన వ్లాగ్ చేస్తుండగా, ఆమెకు ఊహించలేనిది అనుభవం ఎదురైంది. ఆ సమయంలో ఆ లేడీ యూట్యూబర్ పక్కనే ఓ వ్యక్తి నిలబడి ఆమెవైపు తదేకంగా చూస్తున్నాడు. దీంతో ఆ యూట్యూబర్ అతన్ని చూసి కాస్త అసౌకర్యానికి లోనైంది. వెంటనే – ‘నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు?’ అని తన భాషలో అడిగింది. దానికి కౌంటర్‌గా ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానంతో ఆ యూట్యబర్ ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఆపై నోటిపై చెయ్యి వేసి నవ్వడం ప్రారంభించింది. దీని తరువాత, ఆమె ఆ వ్యక్తికి వంగి క్షమాపణ చెప్పింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొరియన్ యూట్యూబర్ ‘పొటాటోటర్ట్లీ’ వ్లాగింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె దగ్గరలో నిలబడి ఉన్న స్థానిక దుకాణదారుడిని చూసి కొరియన్‌లో  ‘నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు?’ అని అతడ్ని అడిగింది.  ఆ వ్యక్తిని ఆటపట్టిస్తూ, “నీకు మీకు నచ్చానా?” అని తన భాషలో ఆట పట్టించింది.  అతను ఇండియన్… తన భాష ఎందుకు అర్థం అవుతుందిలే అనుకుంది. కానీ దుకాణదారుడు కూడా ఆ మహిళకు కొరియన్ భాషలో “నేను ఇక్కడే ఓ దుకాణంలో పనిచేస్తున్నాను” సమాధానం చెప్పడం ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. తాను కొరియాలోని ఒక దుకాణంలో పనిచేశానని, అప్పుడే ఆ భాష నేర్చుకున్నట్లు అతను చెప్పాడు. ఇదంతా కొరియన్ భాషలోనే మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.