
తొమ్మిది రోజుల క్రితం కోవిడ్ 19 కి గురై, నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మొదటిసారిగా శనివారం వైట్ హౌస్ బయట పెద్ద సంఖ్యలో చేరిన తన మద్దతుదారులనుఉద్దేశించి మాట్లాడారు. ఐయామ్ ఫీలింగ్ గ్రేట్ ..అని ప్రకటించారు. రండి..ఓటు వెయ్యండి.. ఐ లవ్ యూ అని వారిని ఉత్సాహపరిచారు.. ట్రంప్ మాట్లాడుతున్నంత సేపూ ఆయన సపోర్టర్లు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా..ట్రంప్ ఇక కోవిడ్ ట్రాన్స్ మిషన్ రిస్క్ కానే కారని, ఆయనలో వైరస్ ఆనవాళ్లు ఏవీ లేవని ఆయన డాక్టర్ స్పష్టం చేశారు.నిర్వహించిన టెస్టుల్లో ఈయనలో ఎలాంటి వైరస్ లక్షణాలూ కనిపించలేదన్నారు. కాగా-ట్రంప్ ఉత్సాహంగా సుమారు అరగంట సేపు ప్రసంగించారు.