రైతుల ఆందోళన, కనీస మద్దతుధరపై కేంద్రం హామీ ? నేడూ చర్చలు, పంతం వీడని అన్నదాతలు

రోజురోజుకూ ఉధృతమవుతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం సమస్య పరిష్కారానికి వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానం కొనసాగుతుందని వారికీ లిఖితపూర్వక హామీ ఇచ్ఛే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. రైతు చట్టాలవల్ల ఈ విధానాన్ని ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడుతుందన్న భయంతో అన్నదాతలు మొదట ఈ చట్టాలనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారమే కేంద్రానికి  చివరి అవకాశమని చర్చల ఫలితం తమకు అనుకూలంగా రావాలని రైతులు అంటున్నారు. చట్టాల రద్దు […]

రైతుల ఆందోళన, కనీస మద్దతుధరపై కేంద్రం హామీ ? నేడూ చర్చలు, పంతం వీడని అన్నదాతలు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Dec 03, 2020 | 11:13 AM

రోజురోజుకూ ఉధృతమవుతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం సమస్య పరిష్కారానికి వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానం కొనసాగుతుందని వారికీ లిఖితపూర్వక హామీ ఇచ్ఛే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. రైతు చట్టాలవల్ల ఈ విధానాన్ని ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడుతుందన్న భయంతో అన్నదాతలు మొదట ఈ చట్టాలనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారమే కేంద్రానికి  చివరి అవకాశమని చర్చల ఫలితం తమకు అనుకూలంగా రావాలని రైతులు అంటున్నారు. చట్టాల రద్దు కోసం ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపరచాలని కూడా కోరుతున్నారు. కనీస మద్దతుధరపై హామీ ఇఛ్చినంత మాత్రాన చాలదని, తమ డిమాండ్ ఒక్కటే అని వారు పట్టుబడుతున్నారు.

మహారాష్ట్రలోని నాసిక్ లో రైతులు కూడా ఢిల్లీకి చేరి తమ ‘సోదరుల’ కు సంఘీభావం తెలపాలని సిధ్ద పడ్డారు. మరోవైపు ఢిల్లీకి దారి తీసే సింఘు, నోయిడా, ఘాజీపూర్,  టిక్రి  బోర్డర్స్ రైతులతో నిండిపోయాయి.  దీంతో ఢిల్లీ చేరాలనుకుంటున్న సాధారణ ప్రయాణికులకు దిక్కుతోచడంలేదు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈ సరిహద్దులను మూసివేశారు. గురువారం పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్.. హోం మంత్రి అమిత్ షాతో  సమావేశమవుతున్నారు.అయితే వీరి చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి