చంద్రుడి మట్టిని సేకరించిన చైనా అంతరిక్ష నౌక చాంగె-5
నాలుగు దశాబ్దాల తర్వాత చంద్రుడి మీద మట్టిని సేకరించగలిగాడు మానవుడు. చైనాకు చెందిన అంతరిక్ష నౌక చాంగె-5 ఈ ఘనకార్యం సాధించింది.. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.
నాలుగు దశాబ్దాల తర్వాత చంద్రుడి మీద మట్టిని సేకరించగలిగాడు మానవుడు. చైనాకు చెందిన అంతరిక్ష నౌక చాంగె-5 ఈ ఘనకార్యం సాధించింది.. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. చందమామ మీద ఉన్న ఓసియానుస్ ప్రొసెల్లారమ్ అనే ప్రాంతం నుంచి చాంగె-5 మట్టిని సేకరించింది. రెండు మీటర్ల లోతును తవ్వి మరీ ల్యాండర్ మట్టిని సేకరించిందని అధికారులు వెల్లడించారు. మరికొన్ని శాంపిళ్లను కూడా సేకరించనున్నామని తెలిపారు.. ఇప్పటికే దాదాపు రెండు కిలోల మట్టిని చాంగె-5 సేకరించిందని అన్నారు. జాబిల్లి ఉపరితరం నుంచే కాదు.. లోతుల్లోంచి కూడా మట్టిని సేకరించామని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘనతను సాధించిన చైనా స్పేస్ ఏజెన్సీకి అమెరికా స్పేస్ ఏజెన్సీ అభినందనలు తెలిపింది. చైనా సేకరించిన చంద్రుడి మట్టి శాంపిళ్లపై పరిశోధన చేసే అవకాశం అంతర్జాతీయ పరిశోధనా కమ్యూనిటీ ద్వారా తమకు కూడా రావచ్చని అమెరికా అంటోంది. ఇప్పటి వరకు చంద్రుడి నుంచి మట్టి శాంపిళ్లను సేకరించింది అమెరికా, రష్యా దేశాలే.. ఇప్పుడు వాటి సరసన చైనా కూడా నిలిచింది.. చంద్రుడి నుంచి భూమ్మీదకు మట్టిని సురక్షితంగా తీసుకురావడానికి పటిష్టమైన కంటైనర్‌ను వాడుతున్నారు.