AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులతో ముగిసిన చర్చలు, జనవరిలో మరోసారి భేటీ కావాలని కేంద్రం నిర్ణయం, పలు అంశాలపై సానుకూలత

రైతుల ఆందోళన నేపథ్యంలో రైతులు, రైతు సంఘాల నేతలతో కేంద్రం ప్రభుత్వం ఇవాళ జరిపిన చర్చలు కొంచెం సేపటిక్రితం ముగిశాయి. పలు అంశాలపై..

రైతులతో ముగిసిన చర్చలు, జనవరిలో మరోసారి భేటీ కావాలని కేంద్రం నిర్ణయం, పలు అంశాలపై సానుకూలత
Venkata Narayana
|

Updated on: Dec 30, 2020 | 7:56 PM

Share

రైతుల ఆందోళన నేపథ్యంలో రైతులు, రైతు సంఘాల నేతలతో కేంద్రం ప్రభుత్వం ఇవాళ జరిపిన చర్చలు కొంచెంసేపటిక్రితం ముగిశాయి. పలు అంశాలపై విస్తృతంగా చర్చించిన అనంతరం జనవరిలో మరోసారి భేటీ కావాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ఇక రైతులు ఆందోళనను విరమించాలని కూడా కేంద్రం కోరింది. కాగా, రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్ లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలు తీసుకొచ్చేందుకు, విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదా బిల్లులో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం వంటివాటిపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కాగా, రైతులు లేవనెత్తిన 3 చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరపై చట్టం తేవడం వంటి వాటిపై కేంద్రం తన విముఖతను కొనసాగించింది. మోదీ సర్కారు తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై ప్రముఖంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ మరోమారు రైతులతో కేంద్రం చర్చలు జరిపింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఐదుమార్లు కేంద్రం, రైతులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!