Online Lone Apps Case: ఆన్‌లైన్ లోన్ యాప్ కేసులో కీలక పురోగతి.. మరో కీలక వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
Online Lone Apps Case: ఆన్‌లైన్ లోన్ యాప్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తు చేపడుతున్న పోలీసులు బృందాలకు పురోగతి లభించింది. చైనాకు చెందిన...
Online Lone Apps Case: ఆన్‌లైన్ లోన్ యాప్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తు చేపడుతున్న పోలీసులు బృందాలకు పురోగతి లభించింది. చైనాకు చెందిన లాంబోను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో లాంబోను పోలీసులు పట్టుకున్నారు. అయితే చైనాకు పారిపోయేందుకు ప్రయత్నించిన లాంబో పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా, లాంబో నాలుగు కంపెనీల ద్వారా ఈ లోన్ యాప్‌లను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఈ లాన్ యాప్ దందాలకు లాంబోకు పూర్తి స్థాయిలో సహకరించిన మరో వ్యక్తి నాగరాజును కూడా పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలుకు చెందిన నాగరాజు ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, ఆరు నెలల కాలంలో రూ. 21 వేల కోట్ల లావాదేవీలు జరిపిన లాంబో.. 150 యాప్‌ల ద్వారా లావాదేవీలు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే భారత్ నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు మళ్లీంపుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వేల కోట్ల నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వానికి పోలీసులు సమాచారం అందించారు. లాంబోను అరెస్టు చేసిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇలా లోన్ యాప్‌ల విషయంలో మోసపోయిన బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు కేసు విచారణను వేగంగా జరుపుతున్నారు. ఇలాంటి దందాలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు.