‘ధరణి’ పేరిట నకిలీ మొబైల్‌ యాప్‌, ఇద్దరు అరెస్ట్, రైతులూ తస్మాత్ జాగ్రత్త !

|

Nov 29, 2020 | 8:15 AM

ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా  'ధరణి' వెబ్‌సైట్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు..

ధరణి పేరిట నకిలీ మొబైల్‌ యాప్‌, ఇద్దరు అరెస్ట్, రైతులూ తస్మాత్ జాగ్రత్త !
Follow us on

ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా  ‘ధరణి’ వెబ్‌సైట్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూముల వివరాలను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నారు. ఎవరి పేరిట ఎంత భూమి ఉందన్న సమగ్ర వివరాలతో పాటు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. అయితే ధరణి పేరు మీద నకిలీ మొబైల్‌ యాప్ రావడం కలకలం రేపింది. సదరు యాప్ నిజమైనదే అని భావించారు చాలామంది. ఇప్పటికే 10వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో వెంటనే అటెర్టయిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫేక్ యాప్ క్రియేట్ చేసిన నిందితులను అరెస్ట్‌ చేశారు.

పోలీసులు‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘ధరణి- తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌’ పేరిట ఓ ఫేక్ యాప్‌‌ను గుర్తించిన రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌(టీఎస్‌టీఎస్‌) ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో యాప్‌ ఐపీ అడ్రస్‌ ఆధారంగా కర్ణాటకలోని బీదర్‌ జిల్లా బసవకల్యాణ్‌కు చెందిన స్టేషనరీ వ్యాపారి ప్రేమ్‌మూలే(31), ఆయన ఫ్రెండ్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి మహేశ్‌కుమార్‌ దండోత్‌లు ఈ ఫేక్ యాప్‌ను క్రియేట్ చేసి ప్లే స్టోర్‌లో ఉంచినట్లు గుర్తించారు. సైబర్‌ సీఐ రమేశ్‌ ఆధ్వర్యంలో ఓ టీమ్ కర్ణాటక వెళ్లి నిందితులను అరెస్ట్‌ చేసి శనివారం హైదరాబాద్‌ తీసుకువచ్చింది. ‘ధరణి తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌’ అనే యాప్‌ గవర్నమెంట్‌ది కాదని, డౌన్‌లోడ్‌ చేసుకొని మోసపోవద్దని ఏసీపీ ప్రసాద్‌ కోరారు.

Also Read :

ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని ‘మన్​కీ బాత్’, వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం !

ఏపీలో రెచ్చిపోతున్న దొంగలు, అమలాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో భారీ చోరీ!